Delhi: శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ
ABN , First Publish Date - 2023-01-27T11:57:39+05:30 IST
ఢిల్లీ: లిక్కర్ పాలసీ ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
ఢిల్లీ: లిక్కర్ పాలసీ ఈడీ కేసు (Liquor Policy ED Case)లో శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy) మధ్యంతర బెయిల్ పిటిషన్ (Interim Bail Petition)పై రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. న్యాయమూర్తి జస్టిస్ నాగ్ పాల్ ధర్మాసనం విచారణ జరిపారు. శరత్ చంద్రారెడ్డి నానమ్మ అంత్యక్రియలలో కర్మకాండలు జరపాల్సిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోరారు. జనవరి 25వ తేదీ సాయంత్రం శరత్ చంద్రారెడ్డి నానమ్మ చనిపోయినట్లు కోర్టుకు తెలిపారు. ఆమె అంత్యక్రియలు, కర్మకాండల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెండు వారాల బెయిల్ ఇవ్వాలని కోరారు.
శరత్ తండ్రి విదేశాల్లో ఉండేవారని, నానమ్మ దగ్గరే శరత్ పెరిగాడాని, ఆమె చివరి కోరిక మేరకు నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరత్‌ను అనుమతించాలని, బెయిల్ ఇవ్వాలని శరత్ తరపు న్యాయవాది కోరారు. అయితే గతంలో సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న రౌస్ అవెన్యూ న్యాయస్థానం.. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యంతర బెయిల్‌పై ఉత్తర్వులు ఇవ్వనుంది.