Arunachal MLA: అరుణాచల్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు...కోర్టు ప్రకటన...ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-04-27T08:31:45+05:30 IST

ఓ బీజేపీ ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో గౌహతి హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది....

Arunachal MLA: అరుణాచల్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు...కోర్టు ప్రకటన...ఎందుకంటే...
Arunachal MLA Dasanglu Pul

ఇటానగర్:ఓ బీజేపీ ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో గౌహతి హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది.(Court Declares) తన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల సమాచారాన్ని చేర్చలేదని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభ్యురాలు దాసంగ్లు పుల్(Arunachal MLA Dasanglu Pul) ఎన్నిక చెల్లుబాటు కాదని గౌహతి హైకోర్టు ఇటానగర్ బెంచ్ ప్రకటించింది.(Election Void For Concealing)గతంలో ఆమె భర్త, మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ మరణం తర్వాత 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో దాసంగ్లూ పుల్ ఈ సీటును గెలుచుకుంది.అభ్యర్ధి దసంగ్లు పుల్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 33 ప్రకారం తన నామినేషన్ పత్రాన్ని సమర్పించలేదు. దీంతో అభ్యర్థి యొక్క నామినేషన్ పత్రం తిరస్కరణకు గురవుతుందని కోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి : ATM Baba: ఏటీఎంలను పగలగొట్టడంలో ఈ బీహార్ బాబా శిక్షణ తరగతులు...ఆపై ఆ దొంగలు ఏం చేశారంటే...

45 ఏళ్ల దాసంగ్లు పుల్ మే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హయులియాంగ్ నుంచి తిరిగి ఎన్నికయ్యారు.2019వ సంవత్సరంలో దాసంగ్లు పుల్‌పై ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి లుపాలుమ్ క్రి ఎన్నికల అఫిడవిట్‌లో తన భర్తకు ముంబైలోని నాలుగు, అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు ఆస్తులను ప్రకటించలేదని, దాసంగ్లు పుల్ గెలుపును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.తాను అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఎమ్మెల్యే పుల్ నామినేషన్‌ను ఆమోదించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2023-04-27T08:31:45+05:30 IST