Share News

10 రంగాల్లో సహకారం

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:35 AM

ముఖ్యమైన 10 రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకొనేందుకు భారత్‌, ఒమన్‌ ఓ దార్శనికపత్రం (విజన్‌ డాక్యుమెంట్‌) రూపొందించాయి. ప్రధాని మోదీ, ఒమన్‌ సుల్తాన్‌

10 రంగాల్లో సహకారం

భారత్‌, ఒమన్‌ నిర్ణయం.. ప్రధాని మోదీ, ఒమన్‌ సల్తాన్‌ భేటీ

న్యూఢిల్లీ, డిసెంబరు 16: ముఖ్యమైన 10 రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకొనేందుకు భారత్‌, ఒమన్‌ ఓ దార్శనికపత్రం (విజన్‌ డాక్యుమెంట్‌) రూపొందించాయి. ప్రధాని మోదీ, ఒమన్‌ సుల్తాన్‌ తారిక్‌ మధ్య శనివారం జరిగిన చర్చల్లో ఈమేరకు నిర్ణయించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం సాధ్యమైనంత త్వరగా అమలుచేయాలని చర్చల్లో నిర్ణయించారు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ యుద్ధంతో తలెత్తుతున్న సమస్యలు, ఉగ్రవాదం, ఈ సమస్యకు రెండు దేశాల ఏర్పాటు ద్వారా త్వరగా పరిష్కారం సాధించడంపై చర్చించారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ ఖ్వాత్రా మీడియాకు తెలిపారు. రూ.2500 కోట్ల ఒమన్‌, భారత్‌ సంయుక్త పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసి భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఒమన్‌ సుల్తాన్‌ తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. దార్శనిక పత్రంలో రూపాయి ద్వారా వర్తకంపైనా చర్చించారు.

Updated Date - Dec 17 , 2023 | 05:35 AM