నల్లధనాన్ని మార్చుకునేందుకే కాంగ్రెస్ విరాళాలు
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:34 AM
జల నుంచి క్రౌడ్ ఫండింగ్ రూపంలో విరాళాలు సేకరించడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ విమర్శించింది. నల్లధనాన్ని చట్టబద్ధమైన సొమ్ముగా మార్చుకునేందుకే
న్యూఢిల్లీ, డిసెంబరు 17: ప్రజల నుంచి క్రౌడ్ ఫండింగ్ రూపంలో విరాళాలు సేకరించడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ విమర్శించింది. నల్లధనాన్ని చట్టబద్ధమైన సొమ్ముగా మార్చుకునేందుకే ఇలా చేస్తోందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు నుంచి ఐటీ శాఖ అఽధికారులు రూ.351 కోట్లు స్వాధీనం చేసుకోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ట్వీట్ చేసింది. 1984లో విడుదలైన హిందీ చిత్రం ఇంక్విలాబ్‌లోని క్లిప్పింగ్‌ను ఈ ట్వీట్‌కు జత చేసింది. ఆ సినిమాలో నటించిన సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటుడు కాదర్ ఖాన్‌ల డైలాగును ఉదహరించింది. శ్రేయోభిలాషులు ఇచ్చిన విరాళాలు అంటూ నల్లధనం బ్యాగు ను ఇవ్వడం గురించి మాట్లాడుకోవడం ఆ డైలాగులో ఉంది. ప్రస్తుత పరిస్థితులకు ఈ డైలాగ్ పూర్తిగా సరిపోతుందని బీజేపీ వ్యాఖ్యానించింది.