మానవ హక్కుల పర్యవేక్షణకు కమిటీ
ABN, First Publish Date - 2023-02-06T00:38:07+05:30 IST
మానవ హక్కుల సంబంధిత సమస్యల పర్యవేక్షణ కోసం హోం వ్యవహరాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నేతృత్వంలో కేంద్రప్రభుత్వం తాజాగా ఒక అంతర్‌మంత్రివర్గ(ఇంటర్‌మినిస్టీరియల్) కమిటీని ఏర్పాటు చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: మానవ హక్కుల సంబంధిత సమస్యల పర్యవేక్షణ కోసం హోం వ్యవహరాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నేతృత్వంలో కేంద్రప్రభుత్వం తాజాగా ఒక అంతర్‌మంత్రివర్గ(ఇంటర్‌మినిస్టీరియల్) కమిటీని ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) చేపట్టే యూనివర్సల్ పిరియాడిక్ రివ్యూ(యూపీఆర్) చేసే సూచనల అమలును కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా తెలిపాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 3న కమిటీకి సంబంధించి ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది.
Updated at - 2023-02-06T00:38:09+05:30