Commissioner of Police: మహిళా సిబ్బందికి వసతిగృహం అవసరం

ABN , First Publish Date - 2023-02-02T09:16:21+05:30 IST

రాజధాని నగరంలో 400 మంది మహిళా కానిస్టేబుళ్లు బసచేసేందుకు వసతిగృహాన్ని నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ శం

Commissioner of Police: మహిళా సిబ్బందికి వసతిగృహం అవసరం

- పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌

ప్యారీస్‌(చెన్నై), ఫిబ్రవరి 1: రాజధాని నగరంలో 400 మంది మహిళా కానిస్టేబుళ్లు బసచేసేందుకు వసతిగృహాన్ని నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ తెలిపారు. నగర పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు విధి నిర్వహణలో, కుటుంబ జీవితంలో సమర్ధవంతంగా వ్యవహారించాలన్న దృష్టితో ‘ఆనందం’ పేరుతో ఏడాదిగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో మహిళా కానిస్టేబుళ్ల నుంచి కమిషనర్‌ హోదాలో ఉన్న 2,216 మంది పాల్గొన్నారు. ఈ పథకం వార్షికోత్సవం వెపేరిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సభలో కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ మాట్లాడుతూ, పొరుగు జిల్లాల నుంచి ఉద్యోగరీత్యా నగరానికి వస్తున్న మహిళా కానిస్టేబుళ్లు ఉండేందుకు అనుకూలమైన భవనం అందుబాటులో లేనందువల్ల వారు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2023-02-02T09:16:23+05:30 IST