చైనా నిఘా బెలూన్‌ పేల్చివేత

ABN , First Publish Date - 2023-02-06T01:03:28+05:30 IST

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన గాలి బుడగ పేలిపోయింది. డ్రాగన్‌ ‘నిఘా బెలూన్‌’గా భావిస్తున్న బుడగను అగ్రరాజ్యం ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-22తో కూల్చివేసింది. బెలూన్‌ అట్లాంటిక్‌ సముద్రం మీదుగా

చైనా నిఘా బెలూన్‌ పేల్చివేత

ఎఫ్‌-22 ఫైటర్‌ జెట్‌తో పనిపట్టిన అమెరికా..

అట్లాంటిక్‌ సముద్రంపై వెళ్తుండగా పేల్చివేత

దక్షిణ కరోలినా తీరంలో.. శకలాల గాలింపు!

తీవ్ర చర్యలు ఉంటాయని డ్రాగన్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 5: అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన గాలి బుడగ పేలిపోయింది. డ్రాగన్‌ ‘నిఘా బెలూన్‌’గా భావిస్తున్న బుడగను అగ్రరాజ్యం ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-22తో కూల్చివేసింది. బెలూన్‌ అట్లాంటిక్‌ సముద్రం మీదుగా వెళ్తుండగా.. ఏఐఎం 9ఎక్స్‌ సైడ్‌ విండర్‌ క్షిపణిని ఉపయోగించి అమెరికా పేల్చివేసింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఈ చర్య చేపట్టారు. బెలూన్‌ శకలాలు దక్షిణ కరోలినా మిర్టిల్‌ తీరంలో పడ్డాయి. అగ్రరాజ్య సైన్యం వీటిని సేకరిస్తోంది. ఈ బెలూన్‌ తొలుత అమెరికా-కెనడా సరిహద్దు రాష్ట్రమైన మోంటానాలో కనిపించిన సంగతి తెలిసిందే. అక్కడినుంచి ఆగ్నేయ అమెరికాలోని దక్షిణ కరోలినా వరకు వచ్చింది. కాగా, గత బుధవారం చైనా నిఘా బెలూన్‌ గురించి గత బుధవారం సమాచారం తెలిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా కూల్చివేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు భూమ్మీద ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంలో.. బెలూన్‌ సముద్రతలంపైకి వచ్చాక చర్యలు చేపట్టారు. మరోవైపు అమెరికా తీరుపై చైనా మండిపడింది. ఆ బెలూన్‌ పౌర వినియోగానికి ఉద్దేశించినదని పేర్కొంది. ఈ చర్యపై తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.

Updated Date - 2023-02-06T01:03:30+05:30 IST