Chief Minister MK Stalin మరదలు మృతి

ABN , First Publish Date - 2023-02-06T10:30:57+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(State Chief Minister MK Stalin) భార్య దుర్గ చెల్లెలు చారుమతి (62) అనారోగ్యం

Chief Minister MK Stalin మరదలు మృతి

చెన్నై/ప్యారీస్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(State Chief Minister MK Stalin) భార్య దుర్గ చెల్లెలు చారుమతి (62) అనారోగ్యం కారణంగా నగరంలో శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఎగ్మూర్‌ కాసమేజర్‌ రోడ్డులోని చారుమతి నివాసానికి ఆదివారం కుటుంబసమేతంగా వెళ్లిన సీఎం స్టాలిన్‌ చారుమతి భౌతికకాయానికి నివాళులర్పించారు. స్టాలిన్‌ భార్య దుర్గ చెల్లెలు చారుమతి అస్వస్థతకు గురై గత కొన్ని రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం తెలిసి రాష్ట్ర మంత్రులు పొన్ముడి, తంగం తెన్నరసు, పీకే శేఖర్‌బాబు తదితరులు నివాళులర్పించగా, సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2023-02-06T10:31:23+05:30 IST