ఎంపీలో కుప్పకూలిన చార్టర్డ్‌ విమానం

ABN , First Publish Date - 2023-03-19T01:21:11+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ ప్రాంతంలో ఓ చార్టర్డ్‌ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో శిక్షకుడు, మహిళా పైలట్‌ మృతిచెందారని గోండియా జిల్లా బిర్సీ విమానాశ్రయ కంట్రోలర్‌ కమలేశ్‌ మెష్రామ్‌ వెల్లడించారు. శ

ఎంపీలో కుప్పకూలిన చార్టర్డ్‌ విమానం

ట్రైనీ మహిళా పైలట్‌, శిక్షకుడి మృతి

భోపాల్‌, మార్చి 18: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ ప్రాంతంలో ఓ చార్టర్డ్‌ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో శిక్షకుడు, మహిళా పైలట్‌ మృతిచెందారని గోండియా జిల్లా బిర్సీ విమానాశ్రయ కంట్రోలర్‌ కమలేశ్‌ మెష్రామ్‌ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరిందని ఆయన పేర్కొన్నారు. కాగా.. కిర్నాపూర్‌ కొండల్లోని భక్కూతోలా గ్రామంలో విమాన శకలాలను గుర్తించామని, మృతుల శరీరాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-19T01:21:11+05:30 IST