ఇడ్లీలు అమ్ముతున్న చంద్రయాన్‌-3 టెక్నీషియన్‌

ABN , First Publish Date - 2023-09-20T04:30:27+05:30 IST

ఇటీవల ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3కి లాంచ్‌పాడ్‌ తయారు చేసిన సభ్యుల్లో ఒకరైన దీపక్‌ కుమార్‌ ఉప్రారియా ప్రస్తుతం ఇడ్లీలు అమ్ముకుంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌

ఇడ్లీలు అమ్ముతున్న చంద్రయాన్‌-3 టెక్నీషియన్‌

18 నెలలుగా జీతం అందకపోవడమే కారణం

రాంచీ, సెప్టెంబరు 19: ఇటీవల ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3కి లాంచ్‌పాడ్‌ తయారు చేసిన సభ్యుల్లో ఒకరైన దీపక్‌ కుమార్‌ ఉప్రారియా ప్రస్తుతం ఇడ్లీలు అమ్ముకుంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌ కుమార్‌ 2012లో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఈసీ)లో టెక్నీషియన్‌గా చేరారు. కొన్ని రోజులుగా ఆయన కుటుంబ పోషణ కోసం రాంచీలో రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టుకున్నారు. ఉదయం ఇడ్లీలు అమ్మి ఆఫీసుకు వెళ్తూ, తిరిగి సాయంత్రం వచ్చి అదే పనిచేస్తున్నారు. దానికి కారణం 18 నెలలుగా హెచ్‌ఈసీలో ఉద్యోగులకు జీతాలు అందకపోవడమే. మంగళవారం బీబీసీతో మాట్లాడిన దీపక్‌ కుమార్‌ తన దీన స్థితిని వివరించారు. ‘‘మొదట క్రెడిట్‌ కార్డు తీసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. రూ. రెండులక్షల అప్పు తీర్చకపోవడంతో వారు నన్ను డీఫాల్టర్‌గా ప్రకటించారు. అనంతరం నా భార్య నగలు తాకట్టు పెట్టి కుటుంబాన్ని కొన్ని రోజుల పాటు పోషించాను. ఇక ఆకలితో చావకూడదని నిశ్చయించుకుని ఇడ్లీ బండి పెట్టాను. నా భార్య ఇడ్లీలు బాగా చేస్తుంది. రోజుకు మాకు రూ.300-400 వస్తున్నాయి. పెట్టుబడి పోను రూ. 50 నుంచి 100 మిగులుతున్నాయి. ఈ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.’’ అని చెప్పారు.

Updated Date - 2023-09-20T04:30:27+05:30 IST