పప్పులపై కేంద్రం కొత్త విధానం

ABN , First Publish Date - 2023-06-07T06:39:16+05:30 IST

దేశీయంగా కందులు, మినుములు, మసూరి పప్పు దినుసుల ఉత్పత్తులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రైస్‌ సపోర్టు స్కీం (పీఎస్‌ఎస్‌) కింద ఇంతవరకు ఈ మూడు రకాల పప్పుల మొత్తం దిగుబడిలో కేవలం 40

పప్పులపై కేంద్రం కొత్త విధానం

న్యూఢిల్లీ, జూన్‌ 6: దేశీయంగా కందులు, మినుములు, మసూరి పప్పు దినుసుల ఉత్పత్తులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రైస్‌ సపోర్టు స్కీం (పీఎస్‌ఎస్‌) కింద ఇంతవరకు ఈ మూడు రకాల పప్పుల మొత్తం దిగుబడిలో కేవలం 40 శాతాన్ని మాత్రమే ప్రభుత్వం మద్దతు ధర కింద సేకరిస్తుండగా, ఇకపై ఆ ఆంక్షలను ఎత్తివేసింది. 2023–24 పంట కాలంలో రైతులు పండించిన మొత్తం పంటను పీఎస్‌ఎస్‌ కింద సేకరించవచ్చని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. కాగా, జనరిక్‌ మందులు విక్రయించే జన ఔషధి కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సంఘాల (ప్యాక్స్‌) ఆధ్వర్యంలో నడపాలని కేంద్రం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 2వేల జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Updated Date - 2023-06-07T06:39:16+05:30 IST