మహిళా బిల్లు కంటితుడుపు చర్య: బృందా కరాత్‌

ABN , First Publish Date - 2023-09-21T03:17:21+05:30 IST

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కంటి తుడుపు చర్య మాత్రమేనని సీపీఎం రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు బృందా కరాత్‌

మహిళా బిల్లు కంటితుడుపు చర్య: బృందా కరాత్‌

చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్‌ బిల్లు కంటి తుడుపు చర్య మాత్రమేనని సీపీఎం రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు బృందా కరాత్‌ విమర్శించారు. గడిచిన తొమ్మిదేళ్లలో బీజీపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు ప్రజా వ్యతిరేక బిల్లులను అమలు చేసిందని చెప్పారు. ఎన్నికల వేళ మహిళలకు 33ు రిజర్వేషన్‌ బిల్లు నాటకం మొదలుపెట్టిందని ఆరోపించారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానం బీజేపీ రాజకీయ గిమ్మిక్కు అని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం సాధిస్తుందని కరాత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-21T03:17:21+05:30 IST