ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై!
ABN , First Publish Date - 2023-03-02T01:37:57+05:30 IST
ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సీ సామాజిక మాధ్యమ రంగంలోకి మళ్లీ ప్రవేశించారు. ట్విటర్‌కు పోటీగా ‘బ్లూస్కై’ అనే కొత్త యాప్‌ను ఆయన యాపిల్
కాలిఫోర్నియా, మార్చి 1: ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సీ సామాజిక మాధ్యమ రంగంలోకి మళ్లీ ప్రవేశించారు. ట్విటర్‌కు పోటీగా ‘బ్లూస్కై’ అనే కొత్త యాప్‌ను ఆయన యాపిల్ యాప్ స్టోర్‌లో తీసుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. బీటా వెర్షన్‌ను తాత్కాలికంగా లాంచ్ చేశామని, పరిశీలన అనంతరం త్వరలోనే పూర్తిస్థాయిలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. బ్లూస్కైలో 256 అక్షరాల పరిమితితో వినియోగదారులు పోస్టులు పెట్టొచ్చు.