Share News

BJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ భారీ సన్నాహాలు..

ABN , Publish Date - Dec 26 , 2023 | 09:18 AM

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ భారీ సన్నాహాలు నిర్వహిస్తోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 30 లోపు ఏర్పాటు చేయాలని రాష్ట్ర యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో అభ్యర్థి పేరు ప్రకటన తర్వాతనే పార్టీ లోక్‌సభ నియోజకవర్గం ఆఫీసు తెరిచేవారు.

BJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ భారీ సన్నాహాలు..

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ భారీ సన్నాహాలు నిర్వహిస్తోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 30 లోపు ఏర్పాటు చేయాలని రాష్ట్ర యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో అభ్యర్థి పేరు ప్రకటన తర్వాతనే పార్టీ లోక్‌సభ నియోజకవర్గం ఆఫీసు తెరిచేవారు. ఈసారి అభ్యర్థుల పేర్లను ప్రకటించక ముందు నుంచే ఎన్నికల కార్యాకలాపాలు ప్రారంభించాలని అధిష్టానం పేర్కొంది. ఎన్నికల ప్రచారానికి లోక్‌సభ పార్టీ ఆఫీసు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు, వాహనాలపై ఖర్చును వీలైనంత తగ్గించాలని సూచిస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే పార్టీ బీజేపీ కాదని, డబ్బుతో గెలిచి అవినీతికి పాల్పడేది కాంగ్రెస్ అని ప్రజలకు వివరించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి.

Updated Date - Dec 26 , 2023 | 09:18 AM