బిహార్ యూట్యూబర్ మనీశ్ అరెస్టు
ABN , First Publish Date - 2023-03-19T01:21:48+05:30 IST
తప్పుడు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి, భయాందోళనలకు కారణమైన యూట్యూబర్ మనీశ్ కశ్య్‌పను బిహార్ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓయూ) శనివారం అరెస్టు చేసింది.

పట్నా, మార్చి18: తప్పుడు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి, భయాందోళనలకు కారణమైన యూట్యూబర్ మనీశ్ కశ్య్‌పను బిహార్ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓయూ) శనివారం అరెస్టు చేసింది. తమిళనాడులో బిహార్ వలస వచ్చిన కార్మికులను చంపేస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఫేక్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అవి వలస కార్మికుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో 13 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెటియాలోని జగదీశ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మనీశ్ లొంగిపోయాడు.