Share News

బెయిల్‌ పిటిషన్లపై వేగంగా తేల్చాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:33 AM

బెయిల్‌ పిటిషన్లను త్వరగా లిస్టింగ్‌ చేసి పరిష్కరించాలని సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు సూచించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన అంశంకావడంతో తగిన

బెయిల్‌ పిటిషన్లపై వేగంగా తేల్చాలి

లేకుంటే వ్యక్తి స్వేచ్ఛకు భంగం.. హైకోర్టులకు సుప్రీం సూచన

న్యూఢిల్లీ, డిసెంబరు 17: బెయిల్‌ పిటిషన్లను త్వరగా లిస్టింగ్‌ చేసి పరిష్కరించాలని సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు సూచించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన అంశంకావడంతో తగిన ప్రాధాన్యమివ్వాలని తెలిపింది. జస్టిస్‌ సి.టి.రవి కుమార్‌, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. మోసం, ఫోర్జరీ కేసు నమోదైన ఓ నిందితుడు పెట్టుకున్న పిటిషన్‌ను పరిష్కరిస్తూ పలు సూచనలు చేసింది. బెయిల్‌ మంజూరుపై 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సి ఉందని తెలిపింది. వాటిని ఇప్పటికీ కొన్ని చోట్ల అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో ఛత్తీ్‌సగఢ్‌ హైకోర్టు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. నిందితుడి పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు విచారణ తేదీని స్పష్టంచేయలేదు. కేసు వరుస క్రమంలో వస్తుందని తెలిపింది. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నిందితుడి బెయి ల్‌ దరఖాస్తుపై చట్టప్రకారం 4వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనాన్ని ఆదేశించింది.

Updated Date - Dec 18 , 2023 | 03:33 AM