Land Rover : కొత్త లగ్జరీ కారులో దూసుకెళ్తున్న బాబా రామ్‌దేవ్

ABN , First Publish Date - 2023-07-25T12:45:39+05:30 IST

యోగా గురువు రామకృష్ణ యాదవ్ (బాబా రామ్‌దేవ్) సరికొత్త విలాసవంతమైన కారును సొంతం చేసుకున్నారు. బ్రాండ్ న్యూ లాండ్ రోవర్ డిఫెండర్ 130లో దూసుకెళ్తూ ఇటీవల కనిపించారు. సెడోనా రెడ్ కలర్‌లో ఉన్న ఈ కారు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే దీనికి ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానట్లు కనిపిస్తోంది.

Land Rover : కొత్త లగ్జరీ కారులో దూసుకెళ్తున్న బాబా రామ్‌దేవ్

న్యూఢిల్లీ : యోగా గురువు రామకృష్ణ యాదవ్ (బాబా రామ్‌దేవ్) సరికొత్త విలాసవంతమైన కారును సొంతం చేసుకున్నారు. బ్రాండ్ న్యూ లాండ్ రోవర్ డిఫెండర్ 130లో దూసుకెళ్తూ ఇటీవల కనిపించారు. సెడోనా రెడ్ కలర్‌లో ఉన్న ఈ కారు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే దీనికి ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానట్లు కనిపిస్తోంది. దీని రిజిస్ట్రేషన్ ప్లేట్‌పై నంబరు లేదు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130ని ఈ ఏడాదిలోనే మన దేశంలో ప్రవేశపెట్టారు. దీని ప్రారంభ ధర రూ.1.3 కోట్లు. ఎక్స్-షోరూం ధర రూ.1.41 కోట్లు. షోరూమ్ ఫ్లోర్ నుంచి నేరుగా బాబా రామ్‌దేవ్ గ్యారేజీలోకి ఈ కారును తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన తీసుకున్న వేరియంట్ గురించి స్పష్టత లేదు. అయితే ఆయన అత్యుత్తమమైనదానినే తీసుకుంటూ ఉంటారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130లో అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. సింగిల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. 11.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 14-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, హీటింగ్, కూలింగ్, మెమరీ ఫంక్షన్స్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

CBSE: సీబీఎస్‌ఈలో తెలుగు మాధ్యమం

Manipur : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి ఆగని అక్రమ వలసలు.. రెండు రోజుల్లో 718 మంది చొరబాటు..

Updated Date - 2023-07-25T12:45:39+05:30 IST