ధనుర్ధారిగా అయోధ్య రాముడు

ABN , First Publish Date - 2023-04-20T01:57:07+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయంలో ధనుస్సు చేబూనిన ఐదడుగుల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు....

ధనుర్ధారిగా అయోధ్య రాముడు

అయోధ్య, ఏప్రిల్‌ 19: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయంలో ధనుస్సు చేబూనిన ఐదడుగుల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన కృష్ణశిలతో రామ విగ్రహాన్ని తయారు చేయాలని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. దాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించనున్నారు. విల్లు, బాణాలు ధరించిన ఐదేళ్ల బాలరాముడు నిల్చున్న భంగిమలో విగ్రహం ఉంటుందని ట్రస్టు సభ్యుడు ప్రసన్నాచార్య తెలిపారు.

Updated Date - 2023-04-20T01:57:07+05:30 IST