రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు

ABN , First Publish Date - 2023-10-12T03:31:14+05:30 IST

ఎన్నికల కమిషన్‌ రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీని మార్చుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. నవంబరు 23న జరగాల్సిన ఆ ఎన్నికలను నవంబరు 25వ తేదీకి

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు

వేలాది వివాహాలుండడమే కారణం

న్యూఢిల్లీ, అక్టోబరు 11: ఎన్నికల కమిషన్‌ రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీని మార్చుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. నవంబరు 23న జరగాల్సిన ఆ ఎన్నికలను నవంబరు 25వ తేదీకి మార్చింది. నవంబరు 23న రాజస్థాన్‌ వ్యాప్తంగా భారీసంఖ్యలో వివాహాలు, ఇతర కార్యక్రమాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీలు, సామాజిక సంస్థల నుంచి వచ్చిన వినతులు, మీడియాలో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకుంది. రాజస్థాన్‌లో నవంబరు 23న దేవ్‌ ఉథాని ఏకాదశి రావడంతో ఏకంగా 50,000 పెళ్లిళ్లు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు పోలింగ్‌కు హాజరవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని, రవాణా సమస్యలు కూడా తలెత్తి పోలింగ్‌ శాతం తగ్గిపోయే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2023-10-12T03:31:14+05:30 IST