Viral Video: సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈటానగర్‌ సొగసుల వీడియో

ABN , First Publish Date - 2023-04-18T14:45:44+05:30 IST

ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై కదులుతున్న అందాల భామల్లా కదులుతున్న కార్లతో..ఈటానగర్ ఫ్లైఓవర్ అద్భుతంగా ..

Viral Video: సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈటానగర్‌ సొగసుల వీడియో

ఈటానగర్(Itanagar) ట్రాఫిక్ క్రమశిక్షణకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై కదులుతున్న అందాల భామల్లా కదులుతున్న కార్లతో..ఈటానగర్ ఫ్లైఓవర్ అద్భుతంగా ఈ వీడియోలో కనిపించింది. ఈటానగర్ అందాలకు ఫిదా అయిన నెటిజన్లు అక్కడి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

అరుణాచల్‌ప్రదేశ్ సీఎం(Arunachal Pradesh Chief Minister) పెమా ఖండూ(Pema Khandu) సోషల్ మీడియాలో తరుచుగా తన రాష్ట్రానికి సంబంధించిన అద్భుతమైన అందాలపై పోస్టులు పెడుతుంటారు. అందులో భాగంగా శనివారం ఈటానగర్‌లో ఓ ఫ్లైఓవర్ వద్ద సాఫీగా సాగుతున్న ట్రాఫిక్(Traffic) సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు.

నిజంగా చాలా అందంగా ఉంది. క్రమశిక్షణతో సాగుతున్న ఈ ట్రాఫిక్ ఆదర్శనీయంగా ఎంతో సంతృప్తినిస్తుంది. నగర జీవితాన్ని సాఫీగా, సులభతరం చేయడంలో ప్రతి పౌరుడి పాత్ర ఉంది. గత కొన్నేళ్లుగా ఈటానగర్‌లో నిర్మాణాత్మక సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయి. ఈ వీడియోను పోస్ట్ చేసిన .... ధన్యావాదాలు. మనకు ఎంతో గర్వకారణమైన ఈటానగర్‌తోపాటు.. ప్రతి నగరం, పట్టణం, గ్రామాన్ని తీర్చిదిద్దాదాం అని ఈ వీడియోను చూసి పోస్ట్ చేశాడు.

11 నిమిషాల ఈ వీడియో.. ఏరియల్ వ్యూ ద్వారా ఈటానగర్ అందాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఓ ఫ్యాషియన్ షోలో అందాల భామలు కదులుతున్న ఈటానగర్‌లో ఫ్లైఓవర్ దగ్గర వెహికల్స్ వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అంతేకాదు.. అక్కడి రోడ్లు పచ్చదనంతో ఈటానగర్ అందాలను అద్దంపడుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర నిర్మాణాలపై ప్రశంసలు కురిపించారు.

ఈ వీడియోను చూసి ‘‘ఈశాన్య భారతదేశంలో ట్రాఫిక్ క్రమశిక్షణ చాలా అద్భుతంగా ఉంటుందని’’ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. అక్కడ ఎవరూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయరని చెప్పుకొచ్చారు. అనవసరంగా హారన్లు మోగించరు. ట్రాఫిక్ గొడవలు చాలా అరుదు అని రాశాడు.

ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘చాలా అద్భుతంగా ఉంది సర్.. ఇటువంటి సదుపాయాలు కల్పించిన మీకు, మీ టీంకు ధన్యవాదాలు’’ అంటూ రాశారు.

కాగా ఇటీవల మీజోరా రాజధాని ఐజ్వాల్‌లో ట్రాఫిక్ క్రమశిక్షణపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. హారన్ మోగించకుండా, ఓవర్ టేక్ చేయకుండా ఒకదాని వెంట ఒకటి కదులుతున్న కార్ల వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. బైక్‌లపై వెళ్తున్నవారు కూడా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ఉన్నారు. అద్భుతమైన ఈ ట్రాఫిక్ క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

Updated Date - 2023-04-18T14:47:09+05:30 IST