Share News

వేరే రాష్ట్రంలో కేసైనా ముందస్తు బెయిల్‌ ఇవ్వొచ్చు

ABN , First Publish Date - 2023-11-21T04:07:49+05:30 IST

వేరే రాష్ట్రంలో కేసు నమోదైనా.. నిందితులకు హైకోర్టులు, సెషన్స్‌ కోర్టులు బెయిల్‌ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వేరే రాష్ట్రంలో కేసైనా ముందస్తు బెయిల్‌ ఇవ్వొచ్చు

న్యూఢిల్లీ, నవంబరు 20: వేరే రాష్ట్రంలో కేసు నమోదైనా.. నిందితులకు హైకోర్టులు, సెషన్స్‌ కోర్టులు బెయిల్‌ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘ప్రియ ఇందోరియా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక’ కేసులో జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రియ ఇందోరియా కర్ణాటకలోని తన భర్త వేధింపులపై రాజస్థాన్‌లోని పుట్టింటికి తిరిగి వెళ్లాక.. అక్కడ కేసు పెట్టారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త బెంగళూరు జిల్లా కోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తీసుకోగా.. దాన్ని ప్రియ ఇందోరియా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. .జీవించే హక్కు, స్వేచ్ఛాహక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు స్థానిక సెషన్స్‌/హైకోర్టులకు బెయిల్‌ ఇచ్చే విచక్షణాధికారాలున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు జిల్లా కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.

Updated Date - 2023-11-21T07:24:36+05:30 IST