Film Director TP Gajendran: కోలీవుడ్‌లో మరో విషాదం

ABN , First Publish Date - 2023-02-06T10:36:10+05:30 IST

కోలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం మృతి నుంచి తేరుకోక

Film Director TP Gajendran: కోలీవుడ్‌లో మరో విషాదం

చెన్నై/అడయార్‌: కోలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం మృతి నుంచి తేరుకోక ముందే ఆదివారం ప్రముఖ సినీ దర్శకుడు టీపీ గజేంద్రన్‌ (68) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. టీపీ గజేంద్రన్‌ భౌతికకాయానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సినీనటులు సెంథిల్‌, గౌండర్‌మణి, రమేష్‌ ఖన్నా తదితరులు నివాళులు అర్పించారు. కాగా, గజేంద్రన్‌ ఒక కన్నడ చిత్రంతో పాటు 15కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. దిగ్గజ దర్శకులు విసు, మోహన్‌ గాంధీరామన్‌ తదితరుల వద్ద అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేశారు. గజేంద్రన్‌ దర్శకుడిగానే కాకుండా వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఈయన అంత్యక్రియలు సోమవారం అంత్యక్రియలు జరుగనున్నాయి.

సీఎం స్టాలిన్‌ నివాళి

తన క్లాస్‌మేట్‌ అయిన టీపీ గజేంద్రన్‌ భౌతికకాయానికి ముఖ్యమంత్రి ఎంకు స్టాలిన్‌ నివాళి అర్పించారు. సాలిగ్రామంలోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయం వెళ్ళిన సీఎం.. భౌతిక కాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన మృతిపై సీఎం స్టాలిన్‌ తన సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రముఖ దర్శక నటుడు, నా కాలేజీ స్నేహితుడైన టీపీ గజేంద్రన్‌ మరణవార్త నన్ను తీవ్ర దుఃఖ సాగరంలో ముంచెత్తింది. ఈ విని దిగ్ర్భాంతికి లోనయ్యాను. 2021 సెప్టెంబరులో అనారోగ్యం బారినపుడు కూడా ఆయన నివాసానికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. ఇపుడు అనుకోని విధంగా ఆయన మరణ వార్త వినాల్సి వచ్చింది. ఈ సందర్భంగా గజేంద్రన్‌ కుటుంబ సభ్యులకు స్టాలిన్‌ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. అలాగే, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ఎంపీ స్వామినాథన్‌, ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం, నడిగర్‌ సంఘం ఉపాధ్యక్షుడు పూచ్చి మురుగన్‌ తదితరులు నివాళులు అర్పించారు.

Updated Date - 2023-02-06T10:36:12+05:30 IST