త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తా

ABN , First Publish Date - 2023-03-31T03:18:47+05:30 IST

తాను త్వరలోనే ప్రపంచం ముందుకు రానున్నట్లు ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్‌ గురువారం ఓ వీడియో సందేశంలో

త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తా

వీడియో సందేశంలో అమృత్‌పాల్‌సింగ్‌

చండీగఢ్‌, మార్చి 30: తాను త్వరలోనే ప్రపంచం ముందుకు రానున్నట్లు ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్‌ గురువారం ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు పోలీసుల నుంచి తృటిలో తప్పించుకోగా.. ఆయన పోలీసులకు లొంగిపోవాలని భావిస్తున్నట్లుగా బుధవారం ఓ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అది విడుదలైన 24 గంటల్లోనే అమృత్‌పాల్‌ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘నేను పారిపోయానని, నా అనుచరులను వదిలిపెట్టానని భావించేవారు ఆ భ్రమ నుంచి బయటకు రావాలి. నాకు చావంటే భయం లేదు. త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తా’’ అని ఆయన తెలిపారు.

Updated Date - 2023-03-31T03:18:47+05:30 IST