New Delhi: ఆమె కారణంగా అమృతపాల్ సింగ్ భారతదేశం విడిచి పారిపోలేదు: పంజాబ్ పోలీసు వర్గాలు

ABN , First Publish Date - 2023-04-23T19:17:54+05:30 IST

కిరణ్‌దీప్ కౌర్(Kirandeep Kaur) ప్రస్తుతం ఇండియాలో ఉండటం వల్లే అతను విదేశాలకు ..

New Delhi: ఆమె కారణంగా అమృతపాల్ సింగ్ భారతదేశం విడిచి పారిపోలేదు: పంజాబ్ పోలీసు వర్గాలు

నెల రోజులకు పైగా పరారీలో ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారుడు, వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌(Khalistan Supporter and Separatist Amritpal Singh) ను పోలీసులు ఆదివారం అరెస్టయ్యాడు. అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని భావించిన అమృత్‌పాల్ సింగ్ ఇండియా విడిచి పోలేదని పంజాబ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్రిటన్ జాతీయురాలు(UK national) అయిన అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్(Kirandeep Kaur) ప్రస్తుతం ఇండియాలో ఉండటం వల్లే అతను విదేశాలకు పారిపోలేదని తెలిపాయి. మార్చిలో అమృతపాల్ సింగ్ అజ్ఞాతంలోకి వెళ్లినప్పటినుంచి అతని భార్య కిరణ్‌దీప్ కౌర్((Kirandeep Kaur) పంజాబ్ పోలీసుల నిఘాలో ఉన్నారు.

కాగా కిరణ్‌దీప్ కౌర్ వీసా గడువు జూలైలో ముగియనుంది. ఇటీవల ఆమె లండన్ వెళ్లేందుకు ప్రయత్నించగా అమృత్‌సర్ ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఫిబ్రవరిలో తన పెళ్లికి వారం రోజుల ముందు కిరణ్‌దీప్ కౌర్ ఇండియా వచ్చింది. గత నెలలో అమృత్‌సర్‌లోని జల్లుపూర్ ఖేరా గ్రామంలో అమృతపాల్ సింగ్ తల్లితో పాటు ఆమెను కూడా విచారించారు.

అమృత్‌పాల్ సింగ్ మొదట తన భార్యను సురక్షితంగా దేశం దాటించాలని భావించాడు. ఒకవేళ తాను దేశం విడిచి వెళితే తన భార్యను అరెస్ట్ చేస్తారని, పారిపోయాడని నిందలు వేస్తారనే భయంతోనే అతను ఇండియా ఉన్నాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మార్చి 6న అమృత్ సింగ్ మద్దతుదారుల్లో ఒకరిని విడిపించేందుకు అతని అనుచరులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అమృతపాల్ సింగ్ పోలీసుల వలకు చిక్కకుండా ఉండేందుకు నాలుగు రాష్ట్రాలను దాటాడు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో అతను నిరంతరాయంగా తిరుగుతూనే ఉన్నాడు, ఎక్కడా కూడా కొన్ని రోజులు ఉండలేదని తెలుస్తోంది.

Updated Date - 2023-04-23T19:19:04+05:30 IST