సంక్షోభం నుంచి గట్టెక్కిన అమెరికా

ABN , First Publish Date - 2023-06-02T02:50:47+05:30 IST

డీఫాల్ట్‌ ముప్పు నుంచి అమెరికా ఎట్టకేలకు బయటపడింది. అప్పుల పరిమితి పెంచేందుకు. కొన్ని రకాల బడ్జెట్‌లలో కోత పెట్టడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ బుధవారం రాత్రి పొద్దుపోయాక ఆమోదించింది.

సంక్షోభం నుంచి  గట్టెక్కిన అమెరికా

వాషింగ్టన్‌, జూన్‌ 1: డీఫాల్ట్‌ ముప్పు నుంచి అమెరికా ఎట్టకేలకు బయటపడింది. అప్పుల పరిమితి పెంచేందుకు. కొన్ని రకాల బడ్జెట్‌లలో కోత పెట్టడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ బుధవారం రాత్రి పొద్దుపోయాక ఆమోదించింది. దానిని ఎగువ సభ సెనేట్‌కు పంపింది. సెనేట్‌ శనివారంలోపు దానిని ఆమోదించనుంది. ప్రతినిధుల సభలో 314-117 ఓట్ల తేడాతో బిల్లు నెగ్గింది. అటు సెనేటర్లలో కొందరు కొన్ని సవరణలు ప్రతిపాదించారు. కానీ సోమవారంలోపు బిల్లును ఆమోదించాల్సి ఉన్నందున వీటిని పరిగణనలోకి తీసుకోవడం అనుమానమేనని ఉభయ పార్టీల నేతలు అంటున్నారు.

Updated Date - 2023-06-02T02:50:47+05:30 IST