సీవై-టీబీ ఇంజెక్షన్‌ప్రయోగాలకు అనుమతివ్వండి

ABN , First Publish Date - 2023-06-01T00:44:25+05:30 IST

క్షయను గుర్తించే సీవై-టీబీ ఇంజెక్షన్‌కు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌....

సీవై-టీబీ ఇంజెక్షన్‌ప్రయోగాలకు అనుమతివ్వండి

న్యూఢిల్లీ, మే 31: క్షయను గుర్తించే సీవై-టీబీ ఇంజెక్షన్‌కు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సఐఐ) కేంద్రాన్ని తాజాగా కోరింది. ‘‘మా తాజా ఇంజెక్షన్‌ను పరిశీలించే సౌకర్యాలు ప్రస్తుతం దేశంలోని ఏ ల్యాబ్‌లోనూ అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో మా సంస్థలోనే దాన్ని పరిశీలించేందుకు అనుమతులు కోరుతున్నాం. ఇవి పూర్తైతే ప్రపంచం మొత్తానికి సీవై-టీబీ అందుబాటులోకి వస్తుంది. బయటపడని టీబీని గుర్తించడంలో ఆ ఇంజక్షన్‌ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది’’ అని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది.

Updated Date - 2023-06-01T00:44:25+05:30 IST