Share News

మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్‌

ABN , First Publish Date - 2023-12-11T03:57:03+05:30 IST

బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌(28)ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన బీఎస్పీ అఖిల భారత సమావేశంలో ఆమె ఈ మేరకు ప్రకటన చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాశ్‌

మేనల్లుడికే పార్టీ పగ్గాలు అప్పగించిన బీఎస్పీ చీఫ్‌

లఖ్‌నవూ, డిసెంబరు 10: బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌(28)ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన బీఎస్పీ అఖిల భారత సమావేశంలో ఆమె ఈ మేరకు ప్రకటన చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. యూపీ, ఉత్తరాఖండ్‌ మినహా దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్నచోట్ల పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు బీఎస్పీ షాజహాన్‌పూర్‌ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వీర్‌సింగ్‌ పేర్కొన్నారు. అయితే పార్టీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ ప్రస్తావన లేదు. మాయావతి తమ్ముడు ఆనంద్‌ కుమారుడైన ఆకాశ్‌ ప్రస్తుతం బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా ఉన్నారు. 22ఏళ్ల వయసులో 2017లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆకాశ్‌ లండన్‌లో ఎంబీఏ చదివారు.

Updated Date - 2023-12-11T07:05:49+05:30 IST