AIIMS Madurai: కదిలిన మదురై ఎయిమ్స్‌ పనులు

ABN , First Publish Date - 2023-01-17T09:07:59+05:30 IST

మదురై ఎయిమ్స్‌(AIIMS Madurai) ఆసుపత్రి తాత్కాలిక నిర్వహణ భవననిర్మాణ పనులు రూ.2.16 కోట్లతో ప్రారంభమయ్యాయి. మదురై

AIIMS Madurai: కదిలిన మదురై ఎయిమ్స్‌  పనులు

- రూ.2.16 కోట్లతో ఆస్పత్రి తాత్కాలిక భవనం

పెరంబూర్‌(చెన్నై), జనవరి 16: మదురై ఎయిమ్స్‌(AIIMS Madurai) ఆసుపత్రి తాత్కాలిక నిర్వహణ భవననిర్మాణ పనులు రూ.2.16 కోట్లతో ప్రారంభమయ్యాయి. మదురై జిల్లా తోపూరులో 224.24 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్‌ ఆస్పత్రి నిర్మాణానికి 2019 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్తాపన చేశారు. ఆస్పత్రి నిర్మాణపనులు నాలుగేళ్లలో పూర్తిచేస్తామని ప్రకటించినా నిధులు కేటాయించకపోవడం సహా పలు కారణాలతో 2020 జూలైలో చేపట్టిన ప్రహరీగోడ నిర్మాణపనులు 90 శాతం ముగిశాయి. ఈ నేపథ్యంలో, ఆస్పత్రి భవనాల పర్యవేక్షణకు తాత్కాలిక భవనం ఏర్పాటవుతోంది. కేంద్ర ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో రూ.2.16 కోట్లతో డైరెక్టర్‌, ఇంజనీర్‌ కార్యాలయాలు, సమావేశాల హాలు కోసం తాత్కాలిక భవన నిర్మాణపనులు ఆరు నెలల్లో పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-01-17T09:08:01+05:30 IST