Share News

జీవితకాలం ఎంతో చెప్పేస్తుంది!

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:48 AM

మనిషి జీవితకాలం ఎంత ఉంటుంది? జీవన ప్రమాణాలు, పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది! మనుషుల జీవితకాలం ఎంతో కచ్చితంగా అంచనా వేయగల కృత్రిమ

జీవితకాలం ఎంతో చెప్పేస్తుంది!

ఏఐ టూల్‌ రూపొందించిన శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, డిసెంబరు 25: మనిషి జీవితకాలం ఎంత ఉంటుంది? జీవన ప్రమాణాలు, పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది! మనుషుల జీవితకాలం ఎంతో కచ్చితంగా అంచనా వేయగల కృత్రిమ మేధ పరికరాన్ని(ఏఐ టూల్‌) శాస్త్రవేత్తలు రూపొందించారు. మనుషుల వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, విద్య, ఉద్యోగం, ఆదాయం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వారి జీవితకాలం ఎంతో చెప్పేస్తుంది. ‘లైఫ్‌2వెక్‌’ అని పిలిచే ఈ టూల్‌ను డెన్మార్క్‌ జనాభా నుంచి సేకరించిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు రూపొందించారు. మనిషి జీవితకాలంతో పాటు భవిష్యత్‌ను కూడా అత్యున్నత ప్రమాణాలకు మించిన కచ్చితత్వంతో లైఫ్‌2వెక్‌ అంచనా వేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టూల్‌కు అద్భుతమైన అంచనా సామర్థ్యం ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన ప్రయోగాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ మోడల్స్‌ ఎంత బాగా పనిచేయగలవో పరిశీలిస్తున్నామని, ఇంకా ప్రయోగ దశలోనే ఉందని పేర్కొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:48 AM