IndiGo: పాక్ గగనతలంలోకి దూసుకెళ్లిన ఇండిగో..

ABN , First Publish Date - 2023-06-11T19:47:16+05:30 IST

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అమృత్‌సర్ నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇండిగో అధికారి ఒకరు ఆదివారంనాడు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

IndiGo: పాక్ గగనతలంలోకి దూసుకెళ్లిన ఇండిగో..

న్యూఢిల్లీ: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అమృత్‌సర్ (Amritsar) నుంచి అహ్మదాబాద్ (Ahmadabad)కు ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight) పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇండిగో అధికారి ఒకరు ఆదివారంనాడు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇండిగో 6e-645 విమానం అమృత్‌సర్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి స్వల్పకాలం పాక్ గగనతలంలోకి ప్రవేశించిన తరువాత 9.40 గంటలకు అహ్మదాబాద్ చేరినట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణ ప్రతికూలత కారణంగా అటారీ మీదుగా పాకిస్థాన్‌ గగనతంలోకి విమానం ప్రవేశించినట్టు చెప్పింది. విమానం డైవర్షన్ విషయంలో అటు పాకిస్థాన్ ఏటీసీ, అమృత్‌సర్ ఏటీసీలు ఫోనులో వివరాలు ఇచ్చిపుచ్చుకుంటూ చక్కటి సమన్వయంతో వ్యవహరించాయని, 30 నిమిషాల అనంతరం విమానం సరైన మార్గంలోకి ప్రవేశించి సురక్షితంగా అహ్మాదాబాద్‌ చేరుకున్నట్టు తెలిపింది. కాగా, మరో ఘటన కూడా శనివారం చోటుచేసుకుంది. ఢిల్లీ-చెన్నై విమానం ఒకటి గాలిలో ఉండగానే ఇంజన్‌లో లోపం తలెత్తడంతో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

Updated Date - 2023-06-11T20:42:17+05:30 IST