జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో వేగం పెంచండి: కేంద్రం

ABN , First Publish Date - 2023-08-22T02:42:40+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైర్‌సలో కొత్త వేరియెంట్లు బయటపడుతుండటంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది.

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో వేగం పెంచండి: కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైర్‌సలో కొత్త వేరియెంట్లు బయటపడుతుండటంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. కీలక శాఖల అధికారులతో సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, దేశంలో కొవిడ్‌ పరిస్థితిని సమీక్షించింది. భేటీ తర్వాత రాష్ట్రాలకు పలు సూచనల్ని జారీ చేసింది. కరోనా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను వేగంగా చేయాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరియెంట్లను నిశితంగా పరిశీలించాలని సూచించింది. దేశంలో కొవిడ్‌ పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది.

Updated Date - 2023-08-22T02:42:40+05:30 IST