తాలిబాన్లలో చీలిక?

ABN , First Publish Date - 2023-02-16T01:40:38+05:30 IST

తాలిబాన్ల నాయకత్వంలో చీలిక వచ్చిందా..? రెండు వర్గాలుగా విడిపోయిందా..? దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సిరాజుద్దీన్‌ హక్కానీకి

తాలిబాన్లలో చీలిక?

అఫ్ఘాన్‌ అంతర్గత మంత్రి హక్కానీకి

సుప్రీం నేత హైదాతుల్లాకు మధ్య విభేదాలు

కాబూల్‌, ఫిబ్రవరి 15: తాలిబాన్ల నాయకత్వంలో చీలిక వచ్చిందా..? రెండు వర్గాలుగా విడిపోయిందా..? దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సిరాజుద్దీన్‌ హక్కానీకి, సుప్రీం నేత హైదాతుల్లా అఖుంద్‌జాదాకు మధ్య ఈ వివాదం నడుస్తున్నట్లు దేశ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. స్వయంగా హక్కానీయే ఈ విషయంలో తాజాగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘దేశంలో ప్రస్తుత పరిస్థితి భరింపరానిదిగా ఉంది. ప్రజల్లోనూ ఇది ముదిరి అస్థిరత పెరిగినట్లైతే, వారిని మాకు దగ్గరగా తెచ్చుకోవడం మా బాధ్యత’’ అని ఆయన ఒక సభలో స్పష్టం చేశారు. అయితే, హక్కానీ తన విమర్శలను ఇలా బహిరంగంగా కాక, వ్యక్తిగతంగా చేయాల్సిందని తాలిబాన్ల అధికార ప్రతినిధి సూచించారు. మహిళలపై విధించిన కఠిన నిబంధనల్ని హక్కానీ వర్గం విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇస్లాంలోని ఛాందస నమ్మకాలను అమలు చేయాల్సిందేనని హైదాతుల్లా వర్గం భావిస్తోంది. తాలిబాన్లు రెండు బృందాలుగా విడిపోయారని తాము భావిస్తున్నట్లు కాబూల్‌లోని సలాం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ హంజా మొమైన్‌ హకీమీ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-16T01:40:40+05:30 IST