Jain Temple : కురచ దుస్తులు ధరించినవారికి ప్రవేశం లేదు : జైన దేవాలయం

ABN , First Publish Date - 2023-06-18T16:31:27+05:30 IST

హైందవ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఉన్న వందేళ్లనాటి జైన దేవాలయం నిర్ణయించింది. హైందవ సంస్కృతి విలువలు, గౌరవ, మర్యాదలు క్రమశిక్షణను అమలు చేయాలని, దీనిలో భాగంగా కురచ దుస్తులు ధరించి వచ్చినవారిని ఈ దేవాలయంలోకి అనుమతించరాదని నిర్ణయించింది. డ్రెస్ కోడ్‌ను వివరిస్తూ ఓ నోటీసును ఏర్పాటు చేసింది.

Jain Temple : కురచ దుస్తులు ధరించినవారికి ప్రవేశం లేదు : జైన దేవాలయం

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్) : హైందవ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఉన్న వందేళ్లనాటి జైన దేవాలయం నిర్ణయించింది. హైందవ సంస్కృతి విలువలు, గౌరవ, మర్యాదలు క్రమశిక్షణను అమలు చేయాలని, దీనిలో భాగంగా కురచ దుస్తులు ధరించి వచ్చినవారిని ఈ దేవాలయంలోకి అనుమతించరాదని నిర్ణయించింది. డ్రెస్ కోడ్‌ను వివరిస్తూ ఓ నోటీసును ఏర్పాటు చేసింది.

వందేళ్లనాటి ఈ జైన దేవాలయాన్ని శ్రీ దిగంబర్ జైన్ సభ నిర్వహిస్తోంది. జైనులకు ఇది అత్యంత ప్రసిద్ధమైన ప్రార్థనా స్థలం. ఈ దేవాలయం పాలక వర్గం ఇటీవల ఓ నోటీసును ఏర్పాటు చేసింది. స్త్రీ, పురుష భక్తులు మర్యాద, హుందాతనం ఉట్టిపడేలా దుస్తులు ధరించి, రావాలని తెలిపింది. కురచ దుస్తులు, హాఫ్ ప్యాంట్స్, బెర్మూడా, మినీ స్కర్ట్, నైట్ సూట్, చిరిగిన జీన్స్, ఫ్రాక్, త్రీ క్వార్టర్ జీన్స్ ధరించి వచ్చేవారిని దేవాలయంలోకి అనుమతించేది లేదని తెలిపింది. ఇటువంటి దుస్తులను ధరించి వచ్చేవారు దేవాలయ ప్రాంగణం వెలుపల ప్రార్థన చేసుకోవచ్చునని తెలిపింది.

ఈ దేవాలయం అర్చకుడు శనివారం మాట్లాడుతూ, హిందూ సమాజంలో విలువలు తరిగిపోతున్నాయని, వస్త్ర ధారణ విషయంలో ఇష్టాయిష్టాలు మారుతున్నాయని చెప్పారు. మహిళల్లో ఫ్యాషన్ పట్ల మోజు, మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గౌరవ, మర్యాదలు, క్రమశిక్షణ, విలువలను కాపాడటం కోసం ఈ నిర్ణయం జరిగిందన్నారు. ఈరోజుల్లో సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడం ఓ యుద్ధంలా మారిపోతోందన్నారు. గతంలో మన పూర్వీకులు దేవాలయాలకు సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లేవారన్నారు. నేడు బాలబాలికలు, వృద్ధులు సైతం కురచ దుస్తుల్లో వస్తున్నారన్నారు. ఇది మంచిది కాదని చెప్పారు. పాశ్చాత్య అలవాట్లు, సంస్కృతి మన మతపరమైన విలువలను దెబ్బతీస్తున్నాయన్నారు. మతపరమైన నిబంధనలకు అనుగుణంగానే డ్రెస్ కోడ్‌ను నిర్ణయించామని, దీనిని భక్తులు పాటిస్తున్నారని చెప్పారు. ఇతర మతస్థులు తమ మూల విశ్వాసాలను వదిలిపెట్టడం లేదన్నారు. హిందూ, సనాతన ధర్మానికి చెందినవారు మాత్రమే తమ మతపరమైన విలువలతో రాజీపడుతున్నారన్నారు.

ఇవి కూడా చదవండి

Rs.500 Notes : రూ.500 నోట్లు అదృశ్యం వార్తలపై ఆర్బీఐ స్పందన

Extreme heatwave : ఉత్తరాదిలో విపరీతమైన వడగాడ్పులు.. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో 98 మంది మృతి..

Updated Date - 2023-06-18T16:31:27+05:30 IST