Delhi: ఢిల్లీలోని లీలా ప్యాలస్ ఫైవ్ స్టార్ హోటల్‌కు ఓ వ్యక్తి బురిడీ
ABN , First Publish Date - 2023-01-17T11:50:24+05:30 IST
ఢిల్లీ (Delhi): లీలా ప్యాలస్ ఫైవ్ స్టార్ హోటల్ (Leela Palace Five Star Hotel)కు ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు.
ఢిల్లీ (Delhi): లీలా ప్యాలస్ ఫైవ్ స్టార్ హోటల్ (Leela Palace Five Star Hotel)కు ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)కు చెందిన వ్యాపారవేత్తనని చెబుతూ మహ్మద్ షరీఫ్ (Mohammed Sharif) అనే వ్యక్తి ఆ హోటల్లో దిగాడు. గత ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు హోటల్లోనే బస చేశాడు. నకిలీ బిజినెస్ కార్డుతో హోటల్లోకి ప్రవేశించాడు. రూ. 23.46 లక్షల బిల్లు కట్టకుండా హోటల్ నుంచి మాయమయ్యాడు. దీంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.