ప్రాంతీయ ఎయిర్‌ కనెక్టివిటీకి పెద్దపీట

ABN , First Publish Date - 2023-02-02T03:20:01+05:30 IST

దేశవ్యాప్తంగా ప్రాంతీయ ఎయిర్‌ కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అదనంగా 50 విమానాశ్రయాలు, హెలీపోర్టులు,

ప్రాంతీయ ఎయిర్‌ కనెక్టివిటీకి పెద్దపీట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశవ్యాప్తంగా ప్రాంతీయ ఎయిర్‌ కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అదనంగా 50 విమానాశ్రయాలు, హెలీపోర్టులు, వాటర్‌ ఎయిరోడ్రోమ్స్‌, అడ్వాన్స్‌ లాండింగ్‌ గ్రౌండ్స్‌ను పునరుద్ధరించాలనుకుంటున్నట్టు బుధవారం పేర్కొంది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. దీని వల్ల దేశవ్యాప్తంగా ప్రాంతీయ కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో తెచ్చిన ఉడాన్‌ పథకానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది. ప్రాంతీయ ఎయిర్‌ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం తీసుకువచ్చింది.

Updated Date - 2023-02-02T03:20:06+05:30 IST