సుందర్బన్స్‌పై నిఘాకు బెటాలియన్
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:38 AM
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ని వ్యూహాత్మక సుందర్బన్స్ మడ అడవుల ప్రాంతంపై నిఘా కోసం బీఎ్‌సఎఫ్ కీలక ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాంతంలో చొరబాట్లు,
కోల్‌కతా, డిసెంబరు 17: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ని వ్యూహాత్మక సుందర్బన్స్ మడ అడవుల ప్రాంతంపై నిఘా కోసం బీఎ్‌సఎఫ్ కీలక ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాంతంలో చొరబాట్లు, స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు సుమారు 1,100 మందికిపైగా సిబ్బందితో కూడిన మెరైన్ బెటాలియన్‌తోపాటు 40 డ్రోన్ స్క్వాడ్రన్లు, ఆల్-టెరైన్ వెహికల్స్ (ఏటీవీ)ను ఏర్పాటు చేయనుంది. కోల్‌కతా కేంద్రంగా ఉన్న బీఎ్‌సఎ్‌ఫకు చెందిన తూర్పు కమాండ్ ఈ ప్రణాళిక బ్లూప్రింట్‌ను రూపొందించిందని, కేంద్ర హోంశాఖ ఆమోదం, ఆర్థికపరమైన అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.