Share News

ఐటీ దాడుల్లో రూ.94 కోట్ల నగదు సీజ్‌

ABN , First Publish Date - 2023-10-17T02:45:21+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలతో పాటు ఢిల్లీ, బెంగళూరులో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు.

ఐటీ దాడుల్లో రూ.94 కోట్ల నగదు సీజ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 16: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలతో పాటు ఢిల్లీ, బెంగళూరులో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ నివాసాలు, కార్యాలయాల్లో లెక్కల్లో చూపని రూ.94 కోట్ల నగదు, రూ.8 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, 30 లగ్జరీ వాచ్‌లను సీజ్‌ చేసినట్టు సోమవారం సీబీడీటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 55 చోట్ల సోదాలు చేసినట్టు పేర్కొంది.

Updated Date - 2023-10-17T02:45:21+05:30 IST