Viagra Death : ప్రాణం తీసిన వయాగ్రా ‘మత్తు’

ABN , First Publish Date - 2023-03-08T02:33:49+05:30 IST

స్నేహితురాలితో ఏకాంతంగా గడిపేక్రమంలో ఓ వ్యక్తి లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఏకంగా రెండు 50 ఎంజీ వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. అది కూడా పూటుగా మద్యం సేవించిన స్థితిలో

Viagra Death : ప్రాణం తీసిన వయాగ్రా ‘మత్తు’

మద్యంతో 2 మాత్రలు వేసుకున్న వ్యక్తి

అప్పటికే హై బీపీ సమస్య.. పొద్దున

నిద్రలేచాక అసౌకర్యం.. వాంతులు

ఆస్పత్రికి తరలించేలోపే మృతి

మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా

తగ్గి, తీవ్ర రక్త స్రావంతోనే మరణం

నాగపూర్‌, మార్చి 7: స్నేహితురాలితో ఏకాంతంగా గడిపేక్రమంలో ఓ వ్యక్తి లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఏకంగా రెండు 50 ఎంజీ వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. అది కూడా పూటుగా మద్యం సేవించిన స్థితిలో వేసుకున్నాడు.ఈ నిర్లక్ష్యమే అతడి నిండు ప్రాణాలు తీసింది. తొలుత వాంతులై, అనంతరం మెదడులో తీవ్ర రక్తస్రావం జరిగి మృతిచెందాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన అజయ్‌ పార్టెకీ! ఈ ఘటనను ‘ఫోరెన్సిక్‌ అండ్‌ లీగల్‌ మెడిసిన్‌’ అనే మాసపత్రిక మార్చి సంచికలో ప్రచురించింది. అందులోని కథనం ప్రకారం.. నాగపూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని ఓ హోటల్‌ గదిలో అజయ్‌ తన స్నేహితురాలితో కలిసి దిగాడు. సాయంత్రం ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం అజయ్‌ వయాగ్రా బ్రాండ్‌ నేమ్‌తో కూడిన ‘సిల్డెన్‌ఫిల్‌’ మాత్రలు రెండింటిని వేసుకున్నాడు. ఉదయం నిద్రలేచాక తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. కొద్దిసేపటికి వాంతులు చేసుకోవడంతో ఆందోళనకు గురైన స్నేహితురాలు, ఆస్పత్రికి వెళ్దామని అతడిని తొందరపెట్టింది. అతడేమో తేలిగ్గా తీసుకున్నాడు. ఇలా తనకు గతంలోనూ జరిగిందన్నాడు. కొద్దిసేపటికే అజయ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. మద్యంతో వయాగ్రా మాత్రలు వేసుకోవడం, దీనికి అతడి హై బీపీ సమస్య తోడవడంతోనే మృతిచెందాడని పోస్టుమార్టం నివేదిక తేల్చింది. అజయ్‌ తరహాలోనే వైద్యుల సూచనలు తీసుకోకుండా వయాగ్రా వాడటం దేశంలో బాగా పెరిగిపోయిందని నిపుణులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. వయాగ్రాతో తలనొప్పి, కడుపునొప్పి, రక్తపోటు లాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయన్నారు.

Updated Date - 2023-03-08T02:33:49+05:30 IST