Share News

4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ వట్టి బోగస్‌: కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2023-11-21T04:05:51+05:30 IST

జీడీపీ పరంగా భారత్‌ 4 ట్రిలియన్‌ డాలర్లను దాటి వేసిందంటూ బీజేపీ ఆదివారం చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. అదంతా బోగస్‌ అని పేర్కొంది. ప్రజలను భ్రమల్లో పెట్టటానికి, మీడియా హెడ్‌లైన్లలో నిలవటానికే ఆ ప్రచారం చేశారని తెలిపింది. ఈ

4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ వట్టి బోగస్‌: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, నవంబరు 20: జీడీపీ పరంగా భారత్‌ 4 ట్రిలియన్‌ డాలర్లను దాటి వేసిందంటూ బీజేపీ ఆదివారం చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. అదంతా బోగస్‌ అని పేర్కొంది. ప్రజలను భ్రమల్లో పెట్టటానికి, మీడియా హెడ్‌లైన్లలో నిలవటానికే ఆ ప్రచారం చేశారని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ సోమవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దీనికి తగినట్లుగానే కేంద్ర ఆర్థికశాఖగానీ, జాతీయ గణాంకాల కార్యాలయంగానీ ఈ వార్తలను ధ్రువీకరిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు. భారత్‌ ఇంకా నాలుగు ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ స్థాయికి చేరుకోలేదని సంబంధిత ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2023-11-21T07:25:54+05:30 IST