Share News

గంగాజలంపై 18% జీఎస్టీ

ABN , First Publish Date - 2023-10-13T03:33:47+05:30 IST

కోట్లాదిమంది హిందువులు పరమ పవిత్రంగా భావించే గంగాజలం మీద కేంద్రప్రభుత్వం 18ు జీఎస్టీ విధిస్తోందని.. ప్రభుత్వ దోపిడీకి, కపటత్వానికి ఇది పరాకాష్ఠ అని

గంగాజలంపై 18% జీఎస్టీ

ఇది మీ ప్రభుత్వ దోపిడీకి, కపటత్వానికి పరాకాష్ఠ: ఖర్గే

న్యూఢిల్లీ, అక్టోబరు 12: కోట్లాదిమంది హిందువులు పరమ పవిత్రంగా భావించే గంగాజలం మీద కేంద్రప్రభుత్వం 18% జీఎస్టీ విధిస్తోందని.. ప్రభుత్వ దోపిడీకి, కపటత్వానికి ఇది పరాకాష్ఠ అని కాంగ్రెస్‌ ఆరోపించింది. గురువారం ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్‌ చేశారు. ‘ఒక సాధారణ హిందువుకు పుట్టుక నుంచి మరణం వరకూ తల్లి గంగానది ప్రాధాన్యం సాటిలేనిది. కానీ, మీ ప్రభుత్వం అటువంటి గంగాజలంపైనే 18% జీఎస్టీ విధించింది. గంగాజలాన్ని ఆర్డర్‌ చేసి తెప్పించుకోవాలనుకునే వారికి ఇది ఎంతో భారం. కానీ, మీరు ఆ విషయాన్ని పట్టించుకోనే లేదు’ అని ఖర్గే విమర్శించారు.

Updated Date - 2023-10-13T03:33:47+05:30 IST