యూపీలోని బలియాలో మరో 11 మంది మృతి

ABN , First Publish Date - 2023-06-20T03:15:36+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మరో 11మంది చనిపోయారు. దీంతో, బలియాలో

యూపీలోని బలియాలో మరో 11 మంది మృతి

బలియా, జూన్‌ 19: ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మరో 11మంది చనిపోయారు. దీంతో, బలియాలో ఐదు రోజుల్లో వివిధ అనారోగ్య కారణాలతో చనిపోయినవారి సంఖ్య 68కి చేరిందని అధికారులు తెలిపారు. మరణాలకు కారణాలున్నప్పటికీ.. అందరూ ఒకేసారి ఎందుకు ఇలా మృత్యువాత పడుతున్నారన్నదానిపై దర్యాప్తు చేసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఆదివారం ఆస్పత్రికి చేరుకుంది. ఈ మరణాలపై స్పందించేందుకు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జయంత్‌ కుమార్‌ నిరాకరించారు. చికిత్స పొందుతున్నవారికి అత్యుత్తమ చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

Updated Date - 2023-06-20T03:15:36+05:30 IST