Vibrio vulnificus: బ్యాక్టరీయా సోకిన చేప తిని అవయవాలు కోల్పోయిన మహిళ
ABN , First Publish Date - 2023-09-20T15:04:13+05:30 IST
బ్యాక్టరీయా సోకిన చేప తిని ఓ మహిళ తన నాలుగు అవయవాలు కోల్పోయింది. అమెరికాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న ఓ మహిళ చేపలు తిన్నారు. అవి తిన్న వెంటనే ఆమె అస్వస్థతకు గురైంది.
బ్యాక్టరీయా(Bacteria) సోకిన చేప తిని ఓ మహిళ తన నాలుగు అవయవాలు కోల్పోయింది. అమెరికాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న ఓ మహిళ చేపలు తిన్నారు. అవి తిన్న వెంటనే ఆమె అస్వస్థతకు గురైంది. రోజురోజుకీ అస్వస్థత పెరుగుతుండటంతో డాక్టర్లును సంప్రదించింది. అప్పటికే ఇన్ఫెక్షన్ శరీరంలోని 4 అవయవాలకు పాకింది. దీంతో ఆపరేషన్ చేసి వైద్యులు ఆ అవయవాలను తొలగించారు. ఆమె కిడ్నీలు(Kidneys) ఫెయిల్ అవుతున్నాయని డాక్టర్లు చెప్పారు. విబ్రియో వల్నిఫికస్ అనే బ్యాక్టరీయా సోకిన చేప(Fish) తినడం వల్లే మహిళకు ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.
మనిషి ఒంట్లోని మాంసాన్ని తినేసే ఈ బాక్టీరియాతో అమెరికాలోని న్యూయార్క్, కనెక్టికట్‌లలో గతంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఉప్పునీటిలో, సముద్ర సంబంధిత ఆహారంలో ఈ బాక్టీరియా ఉంటుందని వైద్యులు తెలిపారు.వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. కలరా వ్యాధికి కారణమయ్యే బాక్టీరియా కుటుంబానికి చెందిన విబ్రియో వల్నిఫికస్ సముద్ర సంబంధిత ఆహారంలో ఉంటుంది. ఈ బాక్టీరియా నులివెచ్చని, ఉప్పు నీటిలో ఉంటుంది. అమెరికాలో సముద్ర సంబంధిత ఆహారం వల్ల సంభవించే మరణాలకు అత్యధికంగా ఇదే కారణం. ఈ బాక్టీరియా కారణంగా మరణించేవారిలో 95 శాతం మంది మరణానికి కారణం సముద్ర సంబంధిత ఆహారం జీర్ణం కాకపోవడమే.కనెక్టికట్ నగరం ప్రజారోగ్య శాఖ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ క్రిస్టోఫర్ బోయ్లే మాట్లాడుతూ, లాంగ్ ఐలండ్ సౌండ్‌లో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ఈతకొట్టారని, ఈ వైరస్ సోకడంతో ఆ ఇద్దరూ మరణించారని తెలిపారు. మూడో వ్యక్తికి జులైలో ఈ వైరస్ సోకినట్లు తెలిపారు. ఔట్-ఆఫ్-ది-స్టేట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో రా ఆయిస్టర్స్‌ను తిన్న తర్వాత ఆయనకు ఈ వైరస్ సోకిందన్నారు. ఈ ముగ్గురి వయసు 60 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నారు.
అసలు ఏమిటి ఈ బాక్టీరియా?
విబ్రియో వల్నిఫికస్ అనే బాక్టీరియా కారణంగా చర్మానికి గాయాలవుతాయి, చర్మం పగిలిపోతుంది, అల్సర్లు అవుతాయి. ఈ బాక్టీరియా సోకినవారికి చలి జ్వరం, అతిసార, కడుపు నొప్పి, వాంతి వచ్చే అవకాశం ఉంది. ఈ బాక్టీరియా సోకినపుడు సాధ్యమైనంత త్వరగా చికిత్స పొందాలని వైద్యులు సలహా ఇచ్చారు. గాయాలు ఉన్నవారు బ్యాండేజ్ వేసుకోవాలని సూచించారు. ఇది అత్యంత అరుదైన బాక్టీరియా అని, ఇది మనిషి ఒంట్లో ఉన్న మాంసాన్ని తినేస్తుందని తెలిపారు.