Singapore: గంజాయి కేసులో భారతీయ సంతతి యువకుడికి ఉరిశిక్ష

ABN , First Publish Date - 2023-04-26T14:13:10+05:30 IST

గపూర్‌(Singapore)లోని కోర్టు న్యాయమూర్తి స్టీవెన్ చోంగ్ కొట్టివేశారు. మరోవైపు తంగరాజు సుప్పయ్య ఉరిని అత్యవసరంగా నిలిపివేయాలని సింగపూర్‌కు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (United Nations Human Rights Office) విజ్ఞప్తి చేసినప్పటికీ ..

Singapore: గంజాయి కేసులో భారతీయ సంతతి యువకుడికి ఉరిశిక్ష

సింగపూర్‌(Singapore)లో గంజాయి అక్రమంగా తరలించడానికి కుట్ర పన్నిన ఖైదీని ఉరితీశారు. భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య(46) (Tangaraju Suppiah)ను బుధవారం ఉరితీశారు. ఉరిశిక్ష అమలుకు వ్యతిరేకంగా సుప్పయ్య కుటుంబ సభ్యులు కోర్టులో అప్పీల్ చేశారు. ఉరిశిక్ష అమలును నిలిపివేయాలంటూ సుప్పయ్య అప్పీల్‌ను సింగపూర్‌(Singapore)లోని కోర్టు న్యాయమూర్తి స్టీవెన్ చోంగ్ కొట్టివేశారు. మరోవైపు తంగరాజు సుప్పయ్య ఉరిని అత్యవసరంగా నిలిపివేయాలని సింగపూర్‌కు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (United Nations Human Rights Office) విజ్ఞప్తి చేసినప్పటికీ ఉరిశిక్ష అమలు చేశారు. తంగరాజు సుప్పయ్యను చాంగి జైలు కాంప్లెక్స్‌లో ఉరితీశారు.

2017లో నిబంధనలకు విరుద్ధంగా గంజాయి అక్రమ రవాణా చేసేందుకు సుప్పయ్య ప్రయత్నించాడని సింగపూర్ కోర్టు సుప్పయ్యను దోషిగా తేల్చింది. సుప్పయ్యకు 2018లో మరణశిక్ష విధించింది. మరణశిక్షకు అవసరమైన కనిష్ట పరిమాణం కంటే రెండింతలు గంజాయి అక్రమ రవాణాకు తంగరాజు ప్రయత్నించడంతో దోషిగా నిర్ధారించారు.

అయితే ప్రపంచంలో థాయ్‌లాండ్‌తో సహా చాలా దేశాలు గంజాయి రవాణా తీవ్ర నేరంగా పరిగణించడంలేదని, మరణశిక్షలను రద్దు చేయాలని సింగపూర్ ప్రభుత్వంపై మానవహక్కుల సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక కేంద్రమైన సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మాదక ద్రవ్యాల నిరోధక చట్టాలను అమలు చేస్తోందన్నారు. అక్రమ రవాణా నిరోధించేందుకు అత్యంత ప్రభావవంతమైన మరణశిక్షను సింగపూర్ అమలు చేస్తోంది. అయితే దీనిని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నేరాలను అరికడుతుందనే అపోహతో కొన్ని దేశాల్లో మరణశిక్షను ఇప్పటికీ అమలు చేస్తున్నారని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆరోపించింది.

తంగరాజు కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెట్టాలని ప్రాధేయపడినప్పటికీ కోర్టు మరణదండన విధించింది. మంగళవారం తంగరాజుకు విధించిన మరణశిక్ష అమలు ఈ ఆరు నెలల కాలంలో మొదటిది. గత సంవత్సర కాలంలో సింగపూర్‌లో 12 మందిని ఉరితీశారు. రెండు సంవత్సరాల విరామం తర్వాత మార్చి2022 నుంచి సింగపూర్‌లో మరణశిక్ష అమలు జరుగుతోంది.

ఉరితీసిన వారిలో నాగేంద్రన్ కె.ధర్మలింగం కూడా ఉన్నాడు. అతనిని ఉరితీయడం ఐక్యరాజ్యసమితి, బ్రాన్సన్‌తో సహా ప్రపంచవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. ఎందుకంటే అతను మానసిక వైకల్యంతో ఉన్నారు.

మరణశిక్ష ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన నిరోధకంగా నిరూపించబడలేదు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి విరుద్ధంగా ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఐక్యరాజ్య సమితి అత్యంత తీవ్రమైన నేరాలకు మాత్రమే మరణశిక్షను అనుమతిస్తుంది.

Updated Date - 2023-04-26T14:13:10+05:30 IST