యూకేలో రోడ్లపైకి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సులు

ABN , First Publish Date - 2023-05-16T03:20:39+05:30 IST

యూకేలో డ్రైవర్‌ అవసరం లేని సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సులు తాజాగా ప్రారంభమయ్యాయి. స్టేజ్‌కోచ్‌ సంస్థ వీటిని స్కాట్‌ల్యాండ్‌లోని ఫోర్త్‌ రోడ్డు వారధిపై సోమవారం లాంచ్‌ చేసింది.

యూకేలో రోడ్లపైకి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సులు

లండన్‌, మే 15: యూకేలో డ్రైవర్‌ అవసరం లేని సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సులు తాజాగా ప్రారంభమయ్యాయి. స్టేజ్‌కోచ్‌ సంస్థ వీటిని స్కాట్‌ల్యాండ్‌లోని ఫోర్త్‌ రోడ్డు వారధిపై సోమవారం లాంచ్‌ చేసింది. మొత్తం 5 అలెగ్జాండర్‌ డెన్నిస్‌ ఎన్విరో200ఏవీ బస్సులు వారధిపై ప్రయాణిస్తాయని, వారానికి 10వేలమంది ప్రయాణికుల వరకూ వీటి సేవల్ని పొందుతారని అధికారులు తెలిపారు. ‘‘ఫెర్రీటోల్‌ పార్కు, రైడ్‌ ఇన్‌ ఫైఫీ, ఎడిన్‌బరో పార్కు ప్రాంతాల్లో మొత్తం 14 మైళ్ల దూరంలో, గంటలకు 50 మీటర్ల వేగంతో ఈ బస్సులు ప్రయాణిస్తాయి. వచ్చే ఏడాది బస్సు సేవల్ని మరింతగా విస్తరించే ఆలోచన ఉంది. 2025 ప్రపంచంలో అధికారికంగా నమోదైన తొలి డ్రైవర్‌ రహిత బస్సు ఇదే. ఈ ప్రాజెక్టులో కొంతమేర నిధులను యూకే ప్రభుత్వం సమకూర్చింది’’ అని అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-16T03:20:49+05:30 IST