Israel vs Gaza:యుద్ధంలో గెలుస్తాం.. హమాస్ భారీ ముూల్యం చెల్లించుకుంటుంది: నెతన్యాహు

ABN , First Publish Date - 2023-10-07T14:43:21+05:30 IST

ఇజ్రాయిల్‌పై గాజా రాకెట్లతో దాడికి దిగడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల క్రమంలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధంలో ఉన్నామని, ఈ వార్ లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హమాస్(Hamas) రాకెట్లతో దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Israel vs Gaza:యుద్ధంలో గెలుస్తాం.. హమాస్ భారీ ముూల్యం చెల్లించుకుంటుంది: నెతన్యాహు

జెరూసలెం: ఇజ్రాయిల్‌పై గాజా రాకెట్లతో దాడికి దిగడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల క్రమంలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధంలో ఉన్నామని, ఈ వార్ లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హమాస్(Hamas) రాకెట్లతో దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇజ్రాయిల్(Israel) పౌరులపై హమాస్ ఆకస్మిక దాడి ప్రారంభించిందని అన్నారు.


ఇజ్రాయిల్, గాజాల మధ్య కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భగ్గుమంది. ఇజ్రాయిల్ పై కేవలం 20 నిమిషాల సమయంలో గాజా 5 వేల రాకెట్లను శనివారం ప్రయోగించింది. అదే టైంలో పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ లో చొరబాడ్డారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయిల్ సైన్యం సైతం ప్రతిదాడికి దిగింది. ప్రత్యర్థి దేశ కవ్వింపు చర్యలు చూస్తూ ఊరుకునేది లేదని యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ సైన్యం స్పష్టం చేసింది. గాజా స్ట్రిప్ లో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం ఉదయాన్నే ఇజ్రాయిల్ పై రాకెట్ల వర్షం కురిపించింది. జెరూసలెం తో పాటు దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. రాకెట్ల ప్రయోగంతో చాలా చోట్ల ఆస్తి నష్టం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకి రావొద్దని సైన్యం హెచ్చరించింది. కొందరు చొరబాటుదారులు ప్యారచూట్ ల సాయంతో ఆ దేశంలో అక్రమంగా ప్రవేశించారు.


మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేశాం..

ఇజ్రాయిల్ పై మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేశామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ డేఫ్ వెల్లడించారు. ఆపరేషన్ ఆల్ అక్సా స్ట్రామ్ స్టార్ట్ అయిందని.. ఇప్పటివరకు ప్రత్యర్థిపై 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించినట్లు ఆయన ప్రకటించారు. అయితే ఇజ్రాయిల్ సైన్యం ప్రతి దాడులు చేస్తోంది. గాజా స్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై ఈ దాడులు జరిపింది. ప్రత్యర్థుల రాకెట్లు కూల్చేసేందుకు యాంటీ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. ఇరు దేశాల మధ్య దాడుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

Updated Date - 2023-10-07T14:46:14+05:30 IST