Fact check: రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌కు గుండెపోటు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..!

ABN , First Publish Date - 2023-05-16T18:49:04+05:30 IST

ఇటీవల రష్యా అధ్యక్షుడు(Russian President) పుతిన్(Vladimir Putin) గుండెపోటు(Heart Attack)కు గురైనట్లు మాస్కో టైమ్స్ పత్రిక(The Moscow Times) ఆర్టికల్ ఇప్పుడు సోషల్ మీడియాలో..

Fact check: రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌కు గుండెపోటు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..!

ఇటీవల రష్యా అధ్యక్షుడు(Russian President) పుతిన్(Vladimir Putin) గుండెపోటు(Heart Attack)కు గురైనట్లు మాస్కో టైమ్స్ పత్రిక(The Moscow Times) ఆర్టికల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆర్టికల్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను మాషా పెట్రోవ్ అనే ట్విట్టర్ ఐడీలో పోస్ట్ చేశారు. పుతిన్ గుండెపోటుతో కిందపడిపోతున్నట్లు ఈ స్క్రీన్‌షాట్‌లోని రెండు ఫొటోల్లో కనిపిస్తోంది.

Puthim01.jpg

నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదని ఫ్యాక్ట్ చెక్‌లోతేలింది. అంతేకాదు ఈ ఆర్టికల్ మాస్కో టైమ్స్‌లో ప్రచురించలేదని నిర్ధారించబడింది. ఈ స్క్రీన్ షాట్‌లో కనిపిస్తున్న రెండు ఫొటోలు ఎడిటింగ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసినట్లు నిర్ధారించబడింది. రష్యన్ అధికారిక వెబ్‌సైట్‌ క్రెమ్లిన్‌లోనూ పుతిన్ గుండెపోటుతో బాధపడుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదు. క్రెమ్లిన్ ప్రకారం..మే 15న పుతిన్ మానవ హక్కుల కమిషనర్ టాట్యానా మోస్కల్కోవాతో సమావేశానికి హాజరయ్యారని తెలుస్తోంది.

కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గుండెపోటు ఆర్టికల్‌కు సంబంధించిన ట్వీట్ మార్చి 22న మాషా పెట్రోవ్ ఐడీతో అప్‌లోడ్ చేశారు. మాషా పెట్రోవ్ ట్విట్టర్‌ను చెక్ చేస్తే ఎడిటింగ్ చేసిన ఇలాంటి చిత్రాలు చాలా పోస్ట్ చేసినట్లు గుర్తించారు. కొన్ని ఫొటోల్లో పుతిన్ అరెస్ట్ కాబడినట్లు ఉండటం గమనార్హం.

ఫైనల్‌గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఇటీవల గుండెపోటుతో బాధపడుతున్నారని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ఫొటోలద్వారా తప్పుడు ప్రచారం జరిగిందని సోషల్ మీడియాలో తేలింది.

Updated Date - 2023-05-16T18:59:32+05:30 IST