కృత్రిమ మేధ కారణంగా... అమెరికాలో మేలో 4 వేల మందికి లే ఆఫ్
ABN , First Publish Date - 2023-06-05T01:43:46+05:30 IST
కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా అమెరికాలో మే నెలలో దాదాపు నాలుగు వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు... చాలెంజర్, గ్రే, క్రిస్టమస్
వాషింగ్టన్, జూన్ 4: కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా అమెరికాలో మే నెలలో దాదాపు నాలుగు వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. చాలెంజర్, గ్రే, క్రిస్టమస్ అనే సంస్థ తన నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. కంపెనీలు ప్రకటించిన లే ఆఫ్‌లలో 3900 మంది ఏఐ వల్ల తమ ఉద్యోగాలను కోల్పోగా... మే నెలలోని మొత్తం లే ఆఫ్‌లలో ఇది 4.9 శాతంగా ఉందని పేర్కొంది. కొవిడ్–19 కారణంగా 2020లో మొత్తం 14 లక్షల మంది ఉద్యోగులను కంపెనీలు తొలగించగా.. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు మొత్తం 4 లక్షల 17 వేల 500 మందిని తొలగించినట్లు తెలిపింది. 2009లో అత్యధికంగా 8 లక్షల 20 వేల మందిని కంపెనీలు తొలగించగా... నాటి నుంచి ఈ ఏడాది ప్రారంభంలోనే అత్యధిక తొలగింపులు నమోదయ్యాయని సంస్థ వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపునకు ఏఐ కాకుండా కంపెనీల మూసివేత కూడా మరో కారణమని, 19,600 మంది ఈ కారణంతోనే ఉద్యోగాలు కోల్పోయారని సంస్థ తెలిపింది.