Cigerette Warning: సిగరెట్ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ప్రతి పఫ్‌లోనూ విషముంది

ABN , First Publish Date - 2023-08-02T18:58:22+05:30 IST

‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ హెచ్చరిక ప్రతి సిగరెట్ ప్యాకెట్‌పై ఉంటుంది. సినిమాలు ప్రదర్శించడానికి ముందు ప్రతి థియేటర్‌లోనూ సిగరెట్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటూ ప్రకటనలు వేస్తారు. రద్దీ ప్రాంతాల్లోనూ ‘పొగాకు క్యాన్సర్‌కి కారకం’ అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా...

Cigerette Warning: సిగరెట్ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ప్రతి పఫ్‌లోనూ విషముంది

‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ హెచ్చరిక ప్రతి సిగరెట్ ప్యాకెట్‌పై ఉంటుంది. సినిమాలు ప్రదర్శించడానికి ముందు ప్రతి థియేటర్‌లోనూ సిగరెట్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటూ ప్రకటనలు వేస్తారు. రద్దీ ప్రాంతాల్లోనూ ‘పొగాకు క్యాన్సర్‌కి కారకం’ అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా అమరుస్తుంటారు. అయినా సరే.. జనాల్లో మార్పు రావడం లేదు. అదేదో ప్రాణవాయువు (ఆక్సిజన్) అన్నట్టు.. ప్యాకెట్లకి ప్యాకెట్లు ఊదేస్తుంటారు. ఇలా ఊదిన వారిలో చాలామంది క్యాన్సర్‌తో మృతిచెందారు. ఇప్పటికీ ఈ సిగరెట్స్ వల్ల క్యాన్సర్ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.


ఈ నేపథ్యంలోనే.. కెనడా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం సిగరెట్ ప్యాకెట్లపైనే కాకుండానే.. ప్రతి సిగరెట్‌పై కూడా హెచ్చరికలు ఉంచనుంది. ‘‘సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది, ప్రతి పఫ్‌లో విషం ఉంటుంది’’ అని అర్థం వచ్చేలా.. సిగరెట్లపై వార్నింగ్ పెట్టనున్నారు. అందుకు తగినట్టుగా చిత్రాలను ముద్రించనున్నామని కెనడా ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఈ హెచ్చరికని సిగరెట్లపై ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యువత ధూమపానం జోలికి పోకుండా, అలాగే ఇతరులు తమ అలవాటును మానేందుకు.. ఈ చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపింది. దీంతో.. సిగరెట్లపై ‘హెచ్చిరకలు’ పెట్టబోయే తొలి దేశంగా కెనడా నిలవనుంది.


కేవలం ఇదొక్కటే కాదు.. 2000 సంవత్సరంలో పొగతాగడం వల్ల కలిగే చెడు ప్రభావాల్ని వెల్లడి చేసేలా సిగరెట్ ప్యాకెట్లపై గ్రాఫిక్ చిత్రాలను ముద్రించిన తొలి దేశంగానూ కెనడా నిలిచింది. కెనడా ప్రభుత్వం ఈ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వెనుక.. ఓ బలమైన కారణం ఉంది. అక్కడ ప్రతి ఏటా 48 వేల మంది చనిపోతున్నారు. అక్కడ ఓవరాల్‌గా పొగాకు తాగే శాతం 13గా ఉంది. దీనిని 5 శాతానికి, అలాగే మరణాల రేటును తగ్గించడానికి.. ప్రభుత్వం ఈ చర్యల్ని చేపడుతోంది. ప్రజల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో సగం, కేవలం ఈ పొగాకు కేసుల మీదే పెడుతోంది.

Updated Date - 2023-08-02T18:58:22+05:30 IST