మలేరియాకు రెండో వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2023-10-03T02:14:08+05:30 IST

ప్రపంచంలో మలేరియాకు రెండో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్‌కు సోమవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది...

మలేరియాకు రెండో వ్యాక్సిన్‌

ఆమోదం తెలిపిన డబ్ల్యూహెచ్‌వో

లండన్‌, అక్టోబరు 2: ప్రపంచంలో మలేరియాకు రెండో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్‌కు సోమవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. దీంతో మరింత చవకైనా, ఎక్కువ ప్రభావం కలిగిన వ్యాక్సిన్‌ ప్రపంచ దేశాలకు అందుబాటులోకి రానుంది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఈ మూడు డోసుల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది 75 శాతం కంటే ఎక్కువగా ప్రభావంతంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒక బూస్టర్‌తో మరో సంవత్సరంపాటు రక్షణ లభించనుంది. ఈ వ్యాక్సిన్‌ 2-4 డాలర్లు ఉండవచ్చని, వచ్చే ఏడాది కొన్ని దేశాల్లో ఇది అందుబాటులో ఉండనుందని టెడ్రోస్‌ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఘనా, బుర్కినా ఫాసోలోని రెగ్యులేటరీ అథారిటీలు ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపాయి.

Updated Date - 2023-10-03T02:14:08+05:30 IST