గురుద్వారాలో మద్యం తాగిన మహిళ కాల్చివేత

ABN , First Publish Date - 2023-05-16T03:26:13+05:30 IST

పంజాబ్‌కు చెందిన పర్వీందర్‌ కౌర్‌ అనే మహిళ ఓ గురుద్వారాలో మద్యం సేవించి, మృత్యువును కొనితెచ్చుకుంది.

గురుద్వారాలో మద్యం తాగిన మహిళ కాల్చివేత

పంజాబ్‌లో ఘోరం, ఒకరి అరెస్టు

పటియాల, మే 15: పంజాబ్‌కు చెందిన పర్వీందర్‌ కౌర్‌ అనే మహిళ ఓ గురుద్వారాలో మద్యం సేవించి, మృత్యువును కొనితెచ్చుకుంది. తమ మత విశ్వాసాలను కించపరిచిందంటూ కౌర్‌ను నిర్మల్‌జీత్‌ సింగ్‌ అనే వ్యక్తి తుపాకీతో కాల్చిచంపాడు. పటియాలలోని దుఖ్‌నివారణ్‌ సాహిబ్‌ గురుద్వారాలో ఆదివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. గురుద్వారాలోని పవిత్ర సరోవరం వద్ద ఆమె మద్యం తాగడం చూసి ఆగ్రహంతో కాల్చి చంపానని నిర్మల్‌జీత్‌ పోలీసుల వద్ద అంగీకరించాడు. అతడిని అదుపులోకి తీసుకొని, లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను స్వాధీనం చేసు కున్నామని తెలిపారు. మద్యానికి బానిసై కౌర్‌ ఆపని చేశారని.. 3 తూటాలు శరీరంలోకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే కన్నుమూశారని వివరించారు. నిందితుడిని కోర్టులో హజరుపరిచి, 14 రోజుల జుడిషియల్‌ కస్టడీకి తరలించామన్నారు. కాగా.. కోర్టు విచారణ సందర్భంగా వివిధ సిక్కు సంఘాల నేతలు కోర్టు వద్దకు చేరుకుని సింగ్‌పై పూలు చల్లడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-05-16T03:26:13+05:30 IST